: రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఇరాన్ అత్యధిక బడ్జెట్ చిత్రం


ఇరాన్ చలనచిత్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ చిత్రంగా రూపొందిన 'మహ్మద్' చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళుతోంది. ప్రవక్త జీవిత విశేషాలు ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, భారత సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. మజిద్ మజీదీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 250 కోట్లు) వెచ్చించి తెరకెక్కించారు. ఈనెల 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. 1400 ఏళ్ల క్రితం భూమిపై ఉన్న పరిస్థితులు, యుద్ధ సన్నివేశాలు, ఒంటెల ప్రయాణాలను అద్భుతరీతిలో చిత్రీకరించారని సినీ ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ చిత్ర నిర్మాణం సాగడం గమనార్హం.

  • Loading...

More Telugu News