: నాగార్జునే లేకుంటే సుశాంత్ దక్కేవాడు కాదేమో!: నాగ సుశీల


నేడు రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండగ. అక్కినేని వారింట ఇవాళ మరో స్పెషల్ కూడా ఉంది. అదే నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగార్జున సోదరి నాగ సుశీల తన మనసులోని అనుభవాలను ఓ దినపత్రికతో పంచుకున్నారు. ఇంట్లో అందరూ చినబాబుగా పిలుచుకునే నాగార్జునను అందరూ గారాబం చేసేవాళ్లని, అది చూసి ఇంకా ఏడిపించే వాళ్లమని, తమ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. నాగార్జునే లేకుంటే సుశాంత్ దక్కేవాడు కాదేమో అని అన్నారు. పెళ్లయిన కొత్తల్లో తాను అమెరికా వెళితే, నాగార్జున చదువుకోవడానికి వచ్చాడని, సెలవులు, వారాంతాల్లో తమ ఇంటికొచ్చేవాడని గుర్తు చేసుకున్న ఆమె, సుశాంత్ కు ఒక సంవత్సరం వయసున్నప్పుడు జరిగిన ఘటన గురించి చెప్పుకొచ్చారు. బాగా మంచు పడుతూ, కారు కూడా బయటకు తీయలేని పరిస్థితుల్లో సుశాంత్ కు ఫిట్స్ వచ్చాయట. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చుంటే, నాగార్జున తన చేతుల్లోకి సుశాంత్ ను తీసుకుని కారు గురించి చూడకుండా, అంత మంచులోనే ఆసుపత్రికి పరుగు తీశాడట. బాబు కోలుకునే దాకా ఉన్నాడని, అప్పుడు తను లేకుంటే ఏం జరిగేదో అని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News