: 6-6-0-4, పెను సంచలనం సృష్టించిన అక్సర్ పటేల్


ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా, నాలుగు వికెట్లు తీసిన భారత యువ క్రికెటర్ అక్సర్ పటేల్, కేరళలోని వాయనాడ్ లో జరిగిన అనధికార టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా-ఏ జట్టు వెన్ను విరిచాడు. దీంతో, తొలి టెస్టులో భారత-ఏ జట్టు విజయం సాధించి సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్సర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఆట నాలుగు రోజులకే ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులకే దక్షిణాఫ్రికా-ఏ జట్టు కుప్పకూలగా, డికాక్ 20 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 8 మంది ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేరకుండా పెవిలియన్ దారి పట్టారు. మరో భారత బౌలర్ జయంత్ యాదవ్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

  • Loading...

More Telugu News