: కొన్ని పత్రికలపై హరీష్ రావు నిప్పులు


కేసీఆర్ సర్కారు రూ. 40 కోట్లను ఖర్చుపెట్టి ఉల్లిపాయలను తక్కువ ధరకు అందిస్తుంటే, తెలంగాణలో ఉల్లి దొరకడం లేదని, ప్రజలు బారులు తీరుతూ, గంటలకొద్దీ ఎదురుచూస్తున్నారని కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. సంగారెడ్డిలో ఓ స్థానిక టీవీ చానల్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, పత్రికలు, వార్తా చానళ్లు వాస్తవాలను వక్రీకరించరాదని హితవు పలికారు. ఈ పత్రికలు పచ్చి అబద్ధాలు రాస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. గతంలో సీమాంధ్ర బడాబాబుల చేతుల్లో కేబుల్ రంగం చితికిపోయిందని, ఈ రంగాన్ని సైతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని హరీష్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News