: భారతీయ మహిళకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు
ఓ చిన్నారి మరణానికి కారణమైందన్న ఆరోపణలపై ఓ భారతీయ యువతికి 14 సంవత్సరాల జైలుశిక్షను యూఎస్ ఫెడరల్ కోర్టు విధించింది. వివరాల్లోకి వెళితే, కనెక్టికట్ లో కింజాల్ పటేల్ (29) అనే ఇండియన్ యువతి చిన్న పిల్లల సంరక్షకురాలిగా పనిచేసేది. తన వద్ద పెంపకంలో ఉన్న శివకుమార్ అనే పద్నాలుగు నెలల బాలుడు చిరాకు తెప్పిస్తున్నాడని విసురుగా నెట్టింది. దీంతో ఆ బాలుడి తలకు తీవ్ర గాయాలు కాగా, మూడు రోజుల చికిత్స అనంతరం మరణించాడు. ఈ కేసులో విచారణ జరిపిన ఫెడ్ కోర్టు, ఉద్దేశపూర్వకంగా కింజాల్ హత్య చేయకపోయినా, ఆమె చర్యల కారణంగానే బాలుడు మరణించాడని అభిప్రాయపడింది. ఆమెకు 14 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది.