: పాక్ జాతీయ జెండాకు నిప్పు పెట్టిన పాక్ మాజీ సైనికుడు


పాకిస్థాన్ జాతీయ జెండాకు ఆ దేశ మాజీ సైనికుడు నిప్పుపెట్టిన ఘటన సంచలనం రేపింది. పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన కామరుల్ జమాన్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసేవాడు. సెలవులపై ఇంటికి వెళ్లిన జమాన్ వ్యక్తిగత కారణాలతో చాలా కాలం రెజిమెంట్ కు తిరిగి వెళ్లలేదు. దీంతో అతనిని ఉన్నతాధికారులు సైన్యం నుంచి తొలగించారు. దీనిపై ఆగ్రహించిన జమాన్ అవకాశం దొరికిన ప్రతిసారీ స్వదేశాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. ఉద్యోగం పోవడంతో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జమాన్ పాక్ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు అంటే ఈ నెల 13న జాతీయ జెండాను తగులబెట్టి పాక్ వ్యతిరేక నినాదాలు చేశాడు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా ఆయన మరోసారి పాక్ జెండాను తగులబెట్టి, జాతి వ్యతిరేక నినాదాలు చేశాడు. దీంతో అతనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News