: నివాసంలో చొరబడి బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు... రాజస్థాన్ లో ఘటన
రాజస్థాన్ లో ఓ బీజేపీ శాసనసభ్యుడిపై కాల్పులు జరిగాయి. జైపూర్ లోని మహువా (దౌసా) నియోజకవర్గ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హుడ్లా నివాసంలో ముగ్గురు దుండగులు చొరబడ్డారు. వస్తూనే వారు హుడ్లాపై కాల్పులు జరిపారు. అయితే, ఎమ్మెల్యేకు ఒక్క బుల్లెట్ కూడా తగల్లేదు. వెంటనే తేరుకున్న ఆయన ఎమర్జెన్సీ అలారం మోగించడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.