: శ్రీనీ రాకతో వాతావరణం వేడెక్కింది... వాయిదాపడిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం


కోల్ కతాలో శుక్రవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం చీఫ్ హోదాలో హాజరయ్యారు. శ్రీనీ రాకతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు శ్రీనివాసన్ కు ఏం అర్హత ఉందంటూ పలువురు సభ్యులు వ్యతిరేకించారు. అయితే, బీసీసీఐ సమావేశాలకు తాను హాజరు కావచ్చని జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొన్నారని శ్రీనీ వాదించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు, బీసీసీఐ సమావేశాలకు దూరంగా ఉండాలంటూ శ్రీనివాసన్ కు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఎత్తిచూపారు. దాంతో, శ్రీనివాసన్ వాస్తవిక హోదా విషయంలో న్యాయపరమైన స్పష్టత వచ్చేవరకు ఆయనను అనుమతించలేమని బీసీసీఐ లీగల్ అడ్వైజర్ ఉషానాథ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రకటించారు.

  • Loading...

More Telugu News