: సగం సక్సెస్ సాయికుమార్ దే... తెలుగు ప్రేక్షకుల కోసం మాట మీద నిలబడ్డా!: సుమన్


తన సినీ సక్సెస్ లో సగభాగం తన నటనదైతే, మిగిలిన సగానికి అర్హుడు సాయికుమార్ అని సుమన్ చెప్పారు. పుట్టిన రోజు పురస్కరించుకుని ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సాయికుమార్ కు ధన్యవాదాలని అన్నారు. తొలిసారి డబ్బింగ్ చెప్పడానికి కొందర్ని పరీక్షిస్తే సాయికుమార్ గొంతు సరిపోయిందని తెలిపిన సుమన్, 'సాయి.. ఇక చాలు' అన్నా వినేవాడు కాదని, డబ్బింగ్ మరింత బాగా రావడానికి పదేపదే డైలాగులు చెప్పేవాడని గుర్తు చేసుకున్నారు. అలాగే తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని సుమన్ చెప్పారు. అప్పట్లో తనను కొంత మంది కలసి, 'ఇంత చేసిన తెలుగు ప్రేక్షకులకు ఏమైనా చేయగలవా?' అని అడిగారని, అందుకు సమాధానంగా తెలుగు అమ్మాయినే వివాహం చేసుకుంటానని చెప్పానని, అప్పట్లో మాట ఇచ్చినట్టే డీవీ నరసరాజుగారి మనవరాలు శిరీషను వివాహం చేసుకుని సగం జీవితం రాసిచ్చానని సుమన్ చెప్పారు. కన్నడిగుల ఇంట తమిళుడిగా పుట్టి పెరిగినా తెలుగువాడిగానే ఉన్నానని సుమన్ అన్నారు.

  • Loading...

More Telugu News