: హీరోగా కొనసాగడం కరెక్టా? అనిపించింది... అందుకే ఇలా మారాను!: సుమన్
తనలో మొదలైన అంతర్మథనమే తనను క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మార్చిందని సుమన్ చెప్పారు. పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'నేను నటించిన సినిమాలు ఏవీ హిట్ కావడం లేదు...సరైన కథలు రావడం లేదు... బాక్సాఫీస్ వద్ద నా సినిమాలు ఊహించిన ఫలితాలు మిగల్చడం లేదు. అలాంటి సమయంలో నాకు బాగా పరిచయమున్న, స్నేహితులైన నిర్మాతలను ఇబ్బంది పెట్టి హీరో గా కొనసాగాలి. అది కరెక్టా? అనిపించి, బాగా ఆలోచించిన మీదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాను' అన్నారు. ఇప్పుడు తన కెరీర్ బాగానే సాగిపోతోందని ఆయన తెలిపారు. తన కెరీర్ లో ఎన్నో సినిమాలు మరుపురాని అనుభూతులు మిగిల్చాయని ఆయన చెప్పారు. వినూత్నమైన పాత్రలతో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నానని సుమన్ తెలిపారు.