: సుమన్ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా?


టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అందగాడిగా విలసిల్లిన సుమన్ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా?... 'నీచల్ కుళం' (స్విమ్మింగ్ పూల్) అనే తమిళ సినిమాకు హీరో కోసం నిర్మాత, దర్శకులు వెతుకుతున్నప్పుడు తన ఫ్రెండ్ వారి దగ్గరకు తీసుకెళ్లారని, తన బాడీ లాంగ్వేజ్ చూసి ఓకే చేసిన నిర్మాత, దర్శకులు బ్లాక్ బెల్ట్ ఉందని తెలియడంతో మరింతగా ఓకే చెప్పారని సుమన్ చెప్పారు. దీంతో ఆ సినిమా ద్వారా సినీ రంగప్రవేశం జరిగిందని సుమన్ తెలిపాడు. సినిమా విడుదలైన తరువాత అందరూ అభినందించారని, కరాటే సుమన్ గా ఓ ముద్ర కూడా వేశారని, అభిమానులు రియల్ హీరో అని అప్పట్లోనే పిలుచుకున్నారని సుమన్ వెల్లడించాడు. పుట్టిన రోజును పురస్కరించుకుని సుమన్ తన సుదీర్ఘ సినీ విశేషాలను గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News