: తిరుమల కొండపై నీటికి కటకట


వర్షాభావ పరిస్థితుల కారణంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో నీటి కొరత ఉత్పన్నమైంది. వెంకన్న దర్శనం కోసం రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వస్తుంటారు. అటు, దాదాపు 20 వేల మంది టీటీడీ సిబ్బంది కూడా కొండపైనే నివాసం ఉంటున్నారు. తిరుమల కొండపై ఉన్న ఐదు జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. కల్యాణి డ్యాం నుంచి తరలించే నీరు సరిపోవడంలేదు. దాంతో, జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని సరఫరా చేస్తూ అధికారులు బండిలాగిస్తున్నారు. అవి కూడా ఖర్చయిపోతే ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. నీటి సమస్య కారణంగా భక్తులకు తీవ్ర అసౌకర్యం వాటిల్లుతోంది. దాంతో, అధికారులు వానదేవుడిపైనే ఆశలు పెట్టుకున్నారు!

  • Loading...

More Telugu News