: వైరల్ గా షేర్ అవుతున్న 'జమైకా చిరుత' కిందపడిన వీడియో


మైదానంలో సందడి చేసే జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్సే తన చివరివని చెబుతున్నాడు. 2017లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని బోల్ట్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో జరిగే ఒలింపిక్స్ పూర్తయ్యాక శరీరం పూర్తిగా సహకరిస్తే పరుగులో కొనసాగే అవకాశం ఉందని బోల్ట్ తెలిపాడు. తన వరకు రియో ఒలింపిక్సే చివరివని స్పష్టం చేశాడు. అయితే తన స్పాన్సర్లు మరో ఏడాది కొనసాగాలని కోరుతున్నారని, కోచ్ మాత్రం అది కష్టమేనని చెబుతున్నారని బోల్ట్ పేర్కొన్నాడు. కాగా, బీజింగ్ లో డబుల్స్ స్ప్రింట్ గెలిచిన విజయోత్సాహంలో ఉండగా బోల్ట్ ను కెమెరామెన్ కిందపడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బోల్ట్ తన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉందని సరదాగా వ్యాఖ్యానించగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ అయ్యింది. బోల్ట్ ను పడగొట్టగలిగేది కెమెరా మెన్ మాత్రమే అనే వ్యాఖ్య అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News