: ప్రత్యేక హోదా కోసం మరో ఆత్మహత్యా యత్నం


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ మరో వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లిలో దేవుడినాయుడు అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ... ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే, ఈ ప్రయత్నాన్ని చూసిన స్థానికులు వెంటనే అతడని పట్టుకుని, అఘాయిత్యం జరగకుండా చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు దేవుడినాయుడిని అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News