: గుంటూరు ఆస్పత్రిలో గుట్టలుగా ఎలుకలు... మూషిక వేటగాళ్లను రప్పించిన అధికారులు


సర్కారీ వైద్యాలయాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇతర ఆసుపత్రుల విషయమేమో గాని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొన్న రాత్రి ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఓ చిన్నారి బాలుడు మూషికాల బారిన పడి మృత్యువాతపడిన ఘటన అక్కడి దారుణమైన స్థితిగతులను కళ్లకు కడుతోంది. ఈ ఘటన జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా వైద్యాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. ఆసుపత్రిలో తిష్ట వేసిన ఎలుకలను నిర్మూలించేందుకు ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎలుకలను పట్టేవాళ్లను రప్పించారు. సరంజామాతో ఆసుపత్రికి చేరుకున్న మూషిక వేటగాళ్లు అలా వల వేశారో లేదో, ఇలా 50 ఎలుకలు చిక్కాయట. దీంతో అక్కడి వైద్యాధికారులే కాక ఎలుకలను పట్టేవాళ్లు కూడా విస్తుపోయారు. ఎలుకల కోసం వేట సాగిస్తూనే ఆసుపత్రి మొత్తాన్ని శుభ్రం చేయించే పనిని వైద్యాధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.

  • Loading...

More Telugu News