: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో మర్చిపోయారో... ఇక అంతే!: రాజమౌళికి నాని సూచన
నాని ప్రధాన పాత్రలో నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి అద్భుతంగా ఉందని ప్రశంసించిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా 'సినిమాలో నాని మతిమరుపు వీరుడైతే... నిజ జీవితంలో తానో పెద్ద బ్రాండెడ్ గజినీ'నని రాజమౌళి ట్విట్టర్ ద్వారా చమత్కరించిన సంగతి తెలిసిందే. దీనికి నాని సమాధానమిస్తూ... 'హహహ...సార్, అన్నీ మర్చిపోతే మర్చిపోయారు...కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పడం మాత్రం మర్చిపోయారో ఇంక అంతే' అంటూ సమాధానమిచ్చాడు. కాగా, రాజమౌళి దర్శకత్వంలో నాని 'ఈగ' సినిమాలో నటించిన సంగతి, ఇది అద్భుతమైన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే.