: బీహార్ లో తాయిలాల ప్రకటన షురూ... ఉద్యోగాల్లో 35 శాతం మహిళలకేనంటున్న నితీశ్


బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎలాగైనా ఈ దఫా బీహార్ లో అధికారం చేజిక్కించుకోవాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పలుమార్లు అక్కడ పర్యటించారు. అడగకున్నా రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అయితే బీజేపీకి షాకిచ్చేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన జనతాదళ్ (యునైటెడ్) ఎన్నికల మేనిఫెస్టో (విజన్ డాక్యుమెంట్)ను విడుదల చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే సర్కారీ ఉద్యోగాల్లో 35 శాతం పోస్టులను మహిళలకు కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం రూ.4 లక్షల దాకా రుణాలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, యూనివర్సిటీలకు ఉచితంగానే వైఫై సౌకర్యాన్ని అందిస్తామని ప్రకటించారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రూ.500 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News