: అమెరికా డ్రోన్ దాడుల్లో ఐఎస్ఐఎస్ టెక్కీ, టాప్-3 ఉగ్రవాది అబూ హసన్ అల్ బ్రితానీ హతం
ఐఎస్ఐఎస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టాప్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, టాప్ సైబర్ జిహాదీగా పేరున్న అబూ హసన్ అల్ బ్రితానీ అలియాస్ జునైద్ హుస్సేన్ హతమయ్యాడని అమెరికా ప్రకటించింది. ఐఎస్ఐఎస్ కు టెక్నాలజీని పరిచయం చేసి, ఆపై పలు దేశాల అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసిన పేరున్న బ్రిటన్ వాసి జునైద్, సిరియాలో తాము జరిపిన డ్రోన్ దాడుల్లో మరణించాడని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ మైఖేల్ మెక్ కౌల్ తెలిపారు. ఉగ్రవాదంపై తాము ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నామని, కొత్త నియామకాలు ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉగ్రవాదులను హతమార్చేదిశగా, పెంటగాన్ తయారు చేసుకున్న జాబితాలో మూడో పేరు జునైద్ దే. అతను చేస్తున్న కార్యకలాపాలే అమెరికాకు మోస్ట్ వాంటెడ్ టార్గెట్ గా మార్చాయని బీబీసీ వెల్లడించింది. జునైద్ మరణంతో సిరియాలో సంయుక్త దళాలు కీలక విజయం సాధించినట్లయిందని బ్రిటన్ ప్రభుత్వాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.