: నేనలా అనలేదు, మీడియా వారే వక్రీకరించారు : మాటమార్చిన కేఈ


రాజధాని ప్రాంతంలో భూసేకరణపై తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, నిన్న తానొకటి చెబితే, మీడియా ప్రజలకు మరో సందేశాన్ని పంపిందని అన్నారు. మంత్రి నారాయణపై అసంతృప్తితో ఉన్నానని, తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. రైతులే స్వచ్ఛందంగా భూములిస్తారు, భూసేకరణ అవసరం ఉండదని మాత్రమే తాను చెప్పినట్టు వివరణ ఇచ్చారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించిన మంత్రి నారాయణను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డుపడరాదని జగన్ కు హితవు పలికారు.

  • Loading...

More Telugu News