: గంటన్నర పాటు మోదీ, చంద్రబాబు ఏం మాట్లాడారో బయటపెట్టాలి: జగన్
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. ఢిల్లీలో గంటన్నర పాటు ప్రధాని మోదీ, చంద్రబాబులు సమావేశమైనప్పటికీ... ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని అన్నారు. మోదీ, చంద్రబాబులు అంతసేపు ఏం మాట్లాడుకున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తే యువతకు మంచి జరుగుతుందని... కానీ, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదాపై జనాలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.