: ఆంటీని అమ్మ చంపి ఉండదు: విధి ఖన్నా
షీనా బోరాను తన తల్లి చంపి ఉండకపోవచ్చని ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాల కుమార్తె విధి చెబుతోంది. "నేను, మా అమ్మ చాలా బాగా ఉంటాం. సంజీవ్ ఖన్నా నా నిజమైన తండ్రి అయినప్పటికీ, పీటర్ ముఖర్జియానే నేను తండ్రిగా భావిస్తున్నా. షీనాను నాకు ఆంటీగా పరిచయం చేసింది మా అమ్మ. నేను, పీటర్ దాన్నే నమ్మాము. ఇప్పుడు షీనాను మా అమ్మే హత్యచేసిందంటే నమ్మలేకపోతున్నా" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విధి తెలిపింది. షీనాను తాను ఆంటీ అనే పిలిచేదాన్నని చెప్పింది. కాగా, 2002లో ఇంద్రాణిని వివాహం చేసుకున్న పీటర్, ఆమె కుమార్తె విధిని దత్తత చేసుకున్నారు. అంతకుముందే తనకు పెళ్లయిన విషయాన్ని, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారన్న విషయాలను ఇంద్రాణి దాచిన సంగతి తెలిసిందే.