: ఆ సైకో గురించి చెబితే రూ. లక్ష మీదే! ... 9440796600కు ఫోన్ చేయండి


గోదావరి జిల్లాల మహిళలను సూదులతో గుచ్చుతూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకోను పట్టించిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. సైకో గురించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే, 9440796600కు ఫోన్ చేయాలని తెలిపారు. సైకో కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని, జిల్లా వ్యాప్తంగా 14 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి భారీఎత్తున సోదాలు జరుపుతున్నామని వివరించారు. సైకోను పట్టుకునేందుకు 270 బృందాలను రంగంలోకి దించామని వివరించారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత త్వరలోనే సైకోను పట్టుకుంటామని తెలియజేశారు.

  • Loading...

More Telugu News