: అజ్ఞాతంలోకెళ్లిన హఫీజ్ సయీద్ పాత్రధారి!


సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన 'ఫాంటమ్' చిత్రంలో ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ పాత్రను షానవాజ్ ప్రధాన్ పోషించారు. ఆ పాత్రను పోషించిన ప్రధాన్ వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. దాంతో, భద్రతాపరమైన చిక్కుల నేపథ్యంలో ప్రధాన్ ను చిత్ర యూనిట్ అజ్ఞాతంలోకి పంపింది. ఫాంటమ్ చిత్రాన్ని 26/11 ముంబై పేలుళ్ల ఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రంలో నటించిన నటులందరి భద్రత తమకెంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రధాన్ ఐడెంటిటీ వెల్లడి కావడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News