: ముస్లిం జనాభా పెరుగుదలకు మత రాజకీయాలే కారణం: శివసేన
దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల కలవరపరిచే అంశమని శివసేన అంటోంది. పార్టీ పత్రిక సామ్నాలో ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసింది. మత రాజకీయాల కారణంగానే ముస్లింల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోందని అభిప్రాయపడింది. "దేశం హిందూ దేశమే అయినా, అందులో లౌకికవాదమనే విషం ఉంది. ముస్లిం జనాభా ఎందుకు పెరుగుతోంది? ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. మత రాజకీయాలే అందుకు కారణమని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని శక్తులు దేశాన్ని ఇస్లామీకరణ చేసే దిశగా ఆలోచిస్తున్నాయి. మొఘల్ పాలనను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే 50 ఏళ్లలో అది కార్యరూపం దాల్చితే మనమేమీ ఆశ్చర్యపడనక్కర్లేదు. ముస్లిం జనాభా పెరుగుతోందంటే అందుకు కారణం... ఆ సమాజానికి సంబంధించి కుటుంబ నియంత్రణకు కచ్చితమైన నిబంధనలు లేవు. ఒకరు నలుగురు భార్యలను, పాతికమంది సంతానాన్ని కలిగివుండొచ్చు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇకనైనా మానుకోవాలి. ముస్లింలు పాకిస్థాన్ పరిస్థితిని చూడాలి. హిందువులతో కలిసి పనిచేసేందుకు ముస్లింలు ముందుకురావాలి. హిందువులను మత ప్రాతిపదికన చూడకుండా, మాతృభూమి కోసం పాటుపడాలి. అదేసమయంలో, ముస్లిం జనాభా పెరుగుదల పట్ల హిందుత్వ శక్తులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. సానుకూల దృక్పథంతోనే వారిని ఎదుర్కోవాలి" అని పేర్కొంది.