: ఆగస్టు ఎఫ్అండ్ఓ చివరి రోజున 'బుల్' హైజంప్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆఖరి సెషన్లో మార్కెట్ బుల్ హైజంప్ చేసింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 400 పాయింట్లకు పైగా పెరిగి 26 వేల ఎగువన మొదలైన సెన్సెక్స్, ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 516.53 పాయింట్లు పెరిగి 2.01 శాతం లాభంతో 26,231.19 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 157.10 పాయింట్లు పెరిగి 2.02 శాతం లాభంతో 7,948.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ కాప్ 2.49 శాతం, స్మాల్ కాప్ 2.56 శాతం లాభపడ్డాయి. లిస్డెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 97.97 లక్షల కోట్లకు పెరిగింది. ఎన్ఎస్ఈ-50లో 41 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. హెచ్డీఎఫ్సీ అత్యధికంగా 8.66 శాతం లాభపడింది. కెయిర్న్ ఇండియా, వీఈడీఎల్, ఎన్ఎండీసీ, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు ఆరు నుంచి ఏడున్నర శాతం పెరిగాయి. ఇదే సమయంలో బీహెచ్ఈఎల్, బజాజ్ ఆటో, టీసీఎస్, విప్రో, హీరో మోటో తదితర కంపెనీలు మూడున్నర శాతం వరకూ నష్టపోయాయి.