: భారత సైన్యానికి సజీవంగా పట్టుబడ్డ మరో పాక్ ఉగ్రవాది
భారత సైన్యం మరో గొప్ప విజయం సాధించింది. దాదాపు 20 గంటల పాటు పాక్ ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ముష్కరుడిని ప్రాణాలతో పట్టుకుంది. ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాదిని భద్రతాదళాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం ఐదుగురు సభ్యులు గల ఈ ఉగ్రవాద గ్రూప్ యూరీ సెక్టార్ గుండా భారత్ లోకి ప్రవేశించింది. నిన్నటి నుంచి ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు ఎదురెదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ముష్కరులు చనిపోగా, ఐదోవ్యక్తి సజీవంగా పట్టుబడ్డాడు. ఇటీవలే నవేద్ అనే పాక్ ఉగ్రవాది కూడా ప్రాణాలతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే.