: ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు: మంత్రి నారాయణ
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య మృతి పట్ల మంత్రి నారాయణ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా మాట్లాడారు.