: షీనా బోరాతో చివరి మాటలు అవే: ఆమె ప్రియుడు


రోజుకో మలుపు తిరుగుతున్న షీనా బోరా హత్యకేసులో పోలీసులు ఆమె ప్రియుడ్ని విచారించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ హత్య గురించి తనకు తెలియదని, షీనా బోరా నుంచి చివరిసారి బ్రేకప్ మెసేజ్ వచ్చిందని తెలిపాడు. షీనా గురించి అడిగిన ప్రతిసారీ 'ఆమె వెంటపడడం మానుకో' అని ఇంద్రాణి ముఖర్జియా సలహా ఇచ్చేదని రాహుల్ ముఖర్జియా తెలిపాడు. 2012 ఏప్రిల్ 24న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాతో కలిసి వెళ్లడానికి కొన్ని గంటల ముందు, ఆమెతో మాట్లాడడమే చివరిసారని పోలీసులకు రాహుల్ ముఖర్జియా వెల్లడించాడు. కాగా, షీనా సోదరుడు తల్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోదరి హత్యకు కారణాలు తల్లి వెల్లడించని పక్షంలో తాను బయటపెడతానని బెదిరించిన సంగతి కూడా తెలిసిందే.

  • Loading...

More Telugu News