: కేంద్రం మెడలు వంచేంత వరకు ఉద్యమం ఆగదు: వైకాపా
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. అనంతపురంలో ఈ రోజు జరిగిన సదస్సులో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు విశ్రమించరాదని వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన తమ అధినేత జగన్ పిలుపుమేరకు చేపడుతున్న బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర బంద్ లో ప్రజలందరూ పాల్గొనాలని విన్నవించారు.