: విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయానికి భద్రత... సిబ్బంది కేటాయింపు
విజయవాడలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రతకు సిబ్బందిని కేటాయించారు. శాశ్వత ప్రాతిపదికన 5 బెటాలియన్ల సిబ్బందిని పోలీసు ప్రధాన కార్యాలయం నియమించింది. ఏపీపీఎస్పీ సిబ్బంది నుంచి వారిని నియమించారు. వారంలో నాలుగు రోజులు ఇక్కడే ఉండి సీఎం చంద్రబాబు రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. అంతేగాక ప్రత్యేక హోదా నేపథ్యంలో పలువురు క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి నిరసనలు తెలిపే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే భద్రతకు సిబ్బందిని కేటాయించినట్టు తెలుస్తోంది.