: నితీష్ కోసం వచ్చిన కేజ్రీవాల్ కు ఎయిర్ పోర్టులోనే చుక్కెదురు!


బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యు) నేత నితీష్ కుమార్ ను కలిసేందుకు ఈ ఉదయం పాట్నా వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నిరసన సెగ తగిలింది. పాట్నా ఎయిర్ పోర్టులో అన్నా హజారే మద్దతుదారులు కొందరు కేజ్రీవాల్ కు నల్ల జెండాలు చూపి వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే, భారీ బందోబస్తు మధ్య కేజ్రీవాల్ విమానాశ్రయం నుంచి వెళ్లిపోయారు. నేడు నితీష్ కుమార్ తో కలసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే. బీహార్ లో సేవా హక్కు చట్టం అమలు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే సదస్సులోనూ వీరిద్దరూ పాల్గొంటారు. బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా, గత వారం ఢిల్లీలో జరిగిన అధికారిక సాంస్కృతిక కార్యక్రమాల్లో నితీష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News