: పెరూ కొండల్లో కుప్పకూలిన విమానం... ముగ్గురి మృతి
పెరూ రాజధాని లిమాలో నిన్న ఓ చిన్న విమానం కుప్పకూలింది. లిమా రాజధాని శివారు ప్రాంతం విల్లా మారియా డెల్ ట్రయన్ ఫో జిల్లా పరిధిలోని కొండ ప్రాంతాల్లో ఈ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఇప్పటిదాకా మూడు మృతదేహాలను కనుగొన్నారు. సాంకేతిక లోపం వల్లనే ఈ విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.