: సిల్వర్ ఢమాల్... నిమిషాల వ్యవధిలో రూ. 1,300 పడిపోయిన ధర


వెండి కుదేలైంది. గురువారం నాటి కమోడిటీ మార్కెట్ ప్రారంభంలోనే కిలో వెండి ధర రూ. 1,290 పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 3.72 శాతం పతనం. కిలో వెండి ధర రూ. 33,362 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 320 తగ్గి రూ. 26,420 వద్ద ట్రేడవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే బులియన్ సెంటిమెంటును హరించాయని నిపుణులు వ్యాఖ్యానించారు. క్రూడాయిల్ ధర బ్యారలుకు రూ. 4 తగ్గి రూ. 2,603 వద్ద ఉంది. ఉదయం 9:20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 275 పాయింట్లు పెరిగి 1.07 శాతం లాభంతో 25,990 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News