: జుట్టు కోసం వాడే మందులతో లైంగిక జీవితం నాశనమవుతుందట!


కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుక ఊడిందన్నది పెద్దల సామెత. బట్టతల నివారణ కోసం ఆపసోపాలు పడుతున్న పురుష పుంగవులకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. బట్టతలతో ఇబ్బంది పడుతూ ఒత్తైన జుట్టు కోసం పురుషులు వాడే మందులు వారి లైంగిక జీవితాన్ని నాశనం చేస్తున్నాయట. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. ఇదే విషయాన్ని సదరు చికిత్స చేస్తున్న వైద్యులు, తమ వద్దకు వచ్చే పేషంట్లకు చెప్పి మరీ ట్రీట్ మెంట్ ప్రారంభిస్తున్నారట. బట్టతలతో వచ్చిన వికార రూపాన్ని తొలగించుకోవాలన్న పురుషుల గట్టి పట్టుదల వైద్యుల హెచ్చరికలను డామినేట్ చేస్తుందట. దీంతో ముందైతే చికిత్స ప్రారంభించండి... తర్వాత చూద్దామంటూ వారు వైద్యులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ తరహా మందుల్లో ఫినాస్టెరాయిడ్, డూటాస్టెరాయిడ్ (ప్రోస్కార్, అవోడార్ట్)లు ఉంటాయని, వీటి కారణంగానే ఈ మందులను వాడే వారి లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని తేలింది. అయితే ఈ ప్రభావం కొందరిలో తాత్కాలికంగానే కనిపించినా, మరికొందరిలో పెను ప్రభావాన్నే చూపుతుందట.

  • Loading...

More Telugu News