: శ్రీకాకుళంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం


శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం పట్టణంలో మంత్రి అచ్చెన్నాయుడు పౌరసరఫరాల శాఖ సమీక్ష నిర్వహించారు. మిల్లర్లకు ధాన్యం రవాణా చెల్లింపుపై మంత్రి అచ్చెన్నాయుడు మౌనం దాల్చారని ఎమ్మెల్యే మండిపడ్డారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ, ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తప్పు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.

  • Loading...

More Telugu News