: ఆ కారు ఖరీదు 3.4 కోట్లు...అప్పుడే 8 మంది బుక్ చేసుకున్నారు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ ఖరీదైన కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. 'కాలిఫోర్నియా టీ' పేరిట ఈ కారును ఇండియన్ మార్కెట్ లోకి ఫెరారీ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శరద్ కచాలియా విడుదల చేశారు. ఈ కారు ముంబై ఎక్స్ షోరూం ధరను 3.4 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 1950లో విడుదల చేసిన ఫెరారీ మోడల్ లో ఈ కారును కనువిందు చేసేలా రూపొందించినట్టు ఫెరారీ సంస్థ తెలిపింది. విడుదల చేసిన అనంతరం బుకింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే 8 మంది వినియోగదారులు బుక్ చేసుకున్నట్టు తెలిపారు. త్వరలోనే వారికి ఈ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు.