: ఉద్రిక్తంగా మారిన పటేళ్ల ఆందోళన... ముగ్గురి మృతి
గుజరాత్ లో పటేళ్లు నిర్వహిస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. బంద్ ను అడ్డం పెట్టుకుని పలు చోట్ల అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. ఈ అల్లర్ల కారణంగా ఇంతవరకు ముగ్గురు చనిపోయారని తెలిసింది. పలువురికి గాయాలయ్యాయి. అల్లర్లను అదుపు చేసేందుకు అహ్మదాబాద్, సూరత్ సహా అనేక ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. దాంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బలగాలతో పాటు అదనంగా మరో 5వేల మంది పారా మిలటరీ సిబ్బందిని పంపింది.