: రాష్ట్రాల సీఎస్ లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'ప్రగతి కార్యక్రమం' కింద జరిగిన కాన్ఫరెన్స్ లో తమ రాష్ట్రంలోని సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయా సీఎస్ లు వివరించారు. ఇదే కాన్ఫరెన్స్ లో ఏపీ, తెలంగాణ సీఎస్ లు కూడా పాల్గొన్నారు. ఏపీ సీఎస్ కృష్ణారావు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని మోదీకి వివరించారు.