: ప్రపంచంలో మహిళలు భద్రంగా ఉండే నగరాలేవో తెలుసా?


తమకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భద్రత, రక్షణ కావాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు కోరుకుంటున్నారు. చట్టాలు ఎన్ని చేసినా భద్రత లేదని, స్వేచ్ఛ ఉండడం లేదని మహిళా లోకం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో మహిళల స్వేచ్ఛ, భద్రతను పరిరక్షించే పట్టణాలు ఉన్నాయా? అని కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. మహిళా భద్రతకు పన్నెండు నగరాలు కట్టుబడి ఉన్నాయని, ఈ 12 నగరాల్లో మహిళలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవిస్తున్నారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా మహిళలు ఒంటరిగా, ఆనందంగా ఉండవచ్చని సర్వేలు తెలిపాయి. జపాన్ లోని టోక్యో నగరం అత్యంత భద్రమైన పట్టణంగా పేరొందింది. తరువాత సౌత్ కొరియాలోని సియోల్ పట్టణం మహిళలకు భద్రమైన నగరమని పేర్కొంది. సౌత్ కెనడాలోని టొరెంటో మూడో స్థానంలో నిలిచింది. దుబాయ్ కూడా భద్రతలో బెస్టని సర్వే వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, అమెరికాలోని న్యూయార్క్, శాన్ ప్రాన్సిస్కో, స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్, నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యామ్, ఐస్ లాండ్ లోని రేక్జావిక్, వియత్నాంలోని హోచిమిన్ సిటీ, న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ పట్టణాలు మహిళల స్వేచ్ఛాజీవనానికి అనువుగా ఉన్నాయని సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News