: సానియాకు 'ఖేల్ రత్న'పై కర్ణాటక హైకోర్టు స్టే


'రాజీవ్ ఖేల్ రత్న' ఎంపికలో తనకు అన్యాయం జరిగిందంటూ పారా ఒలింపియన్ గిరీశ నాగరాజె గౌడ దాఖలు చేసిన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో, టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాకు ప్రకటించిన రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. అంతేగాకుండా, ఈ విషయమై కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది. అవార్డుకు సంబంధించిన నియమావళి ప్రకారం అన్ని అర్హతలు తనకున్నాయని, అయినాగానీ క్రీడా మంత్రిత్వ శాఖ తనను పట్టించుకోలేదని గిరీశ తన పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. పాయింట్ల పరంగా సానియా తనకు దరిదాపుల్లో కూడా లేదని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News