: టీవీల పేరిట మోసం చేసే అంజలిపై మరో కేసు


తెలిసిన వారితో ఖరీదైన టీవీలను కొనిపించుకొని, ఆపై వాయిదాలు కట్టకుండా మోసం చేస్తూ, తిరుగుతుండే అంజలిపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలో కేసును నమోదై ఉండగా, తాజాగా చిలకలగూడలో మరో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి సంజీవ్ కుమార్ కు, తన స్నేహితుడు కిరణ్ ద్వారా అంజలి పరిచయమైంది. ఆమెకు రెండు టీవీలు కావాలని, తెలిసిన షోరూంలో ఇప్పించాలని కిరణ్ కోరడంతో, జూన్ 6న రిలయన్స్ షోరూంలో, 26న టీఎంటీ షోరూంలో 1.09 లక్షల విలువైన రెండు స్మార్ట్ టీవీలను ఇప్పించాడు. నెలసరి వాయిదాలను అంజలి కట్టకపోవడంతో ఆ సంస్థలు సంజీవ్ పై ఒత్తిడి తెచ్చాయి. రెండు నెలలుగా తిరుగుతున్నా అంజలి స్పందించకపోవడం, చెప్పకుండా ఇల్లు ఖాళీ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన సంజీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై ఇవే తరహా కేసులు మరిన్ని ఉన్నాయని వెల్లడించిన పోలీసులు, ఈ కేసును కూడా నమోదు చేసుకున్నారు. అంజలి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News