: బేరమాడ్డమంటే భలే సరదా...నేనూ అందర్లాంటి ఆడపిల్లనే!: ఇలియానా
తాను కూడా అందర్లాంటి ఆడపిల్లనేనని బాలీవుడ్ నటి ఇలియానా అంటోంది. ఢిల్లీలో రాయ్ జెజ్.కామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ, షాపింగ్ చేయడమంటే అందరు ఆడపిల్లల్లానే తనకు కూడా సరదా అని తెలిపింది. అందులోనూ బేరమాడుతూ కొనుగోలు చేయడంలో మజాయే వేరంటోంది. అందుకే పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లోను, రోడ్డు పక్కన దుకాణాల్లోను షాపింగ్ చేస్తానని చెప్పింది. షాపు ఓనర్ చెప్పిన రేటుకి బాగా తగ్గించి బేరమాడుతూ షాపింగ్ చేయడం అంటే తనకు ఇష్టమని ఇలియానా చెప్పింది. కాగా, ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అలరించిన సంగతి తెలిసిందే.