: జగన్ ధర్నాలు చేసినంత మాత్రాన జనాలకు ఒరిగేదేమీ లేదు: బోండా ఉమ


వైకాపా అధినేత జగన్ పై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్... ప్రత్యేక హోదా అంశాన్ని ఒక్కసారైనా ప్రధాని దృష్టికి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. జగన్ చేస్తున్న ధర్నాల వల్ల జనాలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకే జగన్ ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు కేంద్రంపై టీడీపీ ఒత్తిడి చేస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News