: హింస వద్దు... ప్రశాంతంగా ఉండండి: పటేళ్లకు మోదీ సూచన
గుజరాత్ లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన పటేల్ కులస్తులకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. హింసతో ఎలాంటి మేలు జరగదని, అందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 22 ఏళ్ల హార్దిక్ పటేల్ అనే యువకుడి నాయకత్వంలో ప్రారంభమైన ఈ ఉద్యమం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. తొలుత ప్రశాంతంగా ఉన్న ఈ ఉద్యమం ఆ తర్వాత హింసాత్మక రూపు దాల్చింది. ఈ రోజు పటేళ్లు చేపట్టిన బంద్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. హార్దిక్ పటేల్ ను అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. ఈ క్రమంలో, పలుచోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, హింస వద్దని పటేళ్లకు ప్రధాని మోదీ హితవు పలికారు.