: పాక్ ముఖ్య నేతను 'ప్రపంచ ఉగ్రవాది'గా ప్రకటించిన అమెరికా
పాకిస్థాన్ కేంద్రంగా హక్కానీ నెట్ వర్క్ ను నిర్వహిస్తున్న ఆ దేశ నేత అబ్దుల్ అజీజ్ హక్కానీని 'ప్రపంచ ఉగ్రవాది'గా అమెరికా పేర్కొంది. ఈ మేరకు 'స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్' జాబితాలో అజీజ్ పేరును చేర్చింది. ఆఫ్గనిస్థాన్ పై అజీజ్ దాడులకు ప్రణాళికలు రూపొందించాడని వెల్లడించింది. కాగా, ఈ జాబితాలోకి పేరెక్కితే, ఏ అమెరికన్ జాతీయుడు అతనితో సంబంధాలు నెరపకూడదు. అతనికేమైనా ఆస్తులుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అల్ ఖైదాతో సంబంధాలు పెట్టుకున్న హక్కానీ నెట్ వర్క్ కు అధినేతగా ఉన్న బద్రుద్దీన్ హక్కానీ మరణానంతరం అజీజ్ బాధ్యతలు స్వీకరించాడు. అజీజ్ ఎక్కడున్నాడన్న సమాచారం అందిస్తే 5 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా గత సంవత్సరం ఆగస్టులో ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా ఆప్గన్ ప్రభుత్వ కార్యాలయాలపై ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్)లతో అజీజ్ దాడులు చేయించాడని అమెరికా ఆరోపించింది.