: ఐఫోన్ కొత్త వెర్షన్ ... సేమ్ టూ సేమ్ ఐఫోన్ 6: లీకైన యాపిల్ తాజా మోడల్!
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ వచ్చే నెలలోనే ఐఫోన్ సిరీస్ లో కొత్త మోడల్ ఐఫోన్ 6ఎస్ ను విడుదల చేయబోతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐఫోన్ మోడళ్లపై ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓ వీడియో లీకైంది. ‘మాక్ రూమర్స్’ ఈ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కొత్తగా మార్కెట్ లోకి రానున్న ఐఫోన్ 6ఎస్... సాంతం ఐఫోన్ 6 మాదిరిగానే కనిపిస్తోంది. ఫీచర్లలో కాస్తంత వ్యత్యాసం ఉన్నప్పటికీ చూడటానికి మాత్రం ఐఫోన్ 6నే తలపిస్తోంది. ఫోర్స్ టచ్ స్ర్రీన్ తో పాటు 12 మెగా పిక్సెల్ కెమెరా.. ఐఫోన్ 6ఎస్ ప్రత్యేకతలుగా ‘మాక్ రూమర్స్’ వెల్లడించింది.