: యువ సంచలనం హార్దిక్ పటేల్ నిర్బంధం... గుజరాత్ వ్యాప్తంగా నిలిచిన మొబైల్ ఇంటర్నెట్
ఓబీసీ కోటా కోసం పటేల్ సామాజిక వర్గం చేపట్టిన నిరసన ప్రదర్శన, తదనంతర పరిణామాలు, రాష్ట్ర బంద్ నేపథ్యంలో గుజరాత్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి మోసానాలో మొదలైన హింస తాజాగా ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాదు, సూరత్, సౌరాష్ట్రలకు కూడా పాకింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం పటేల్ సామాజిక వర్గాన్ని ముందుండి నడిపిస్తున్న 22 ఏళ్ల యువ సంచలనం హార్దిక్ పటేల్ ను నిర్బంధించింది. అంతేకాక అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని విధించింది.