: ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని 11 జిల్లాల బంద్
ఒడిశాలోని కోశల్ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంది. తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ ఒడిశాలోని 11 జిల్లాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు. యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్ ను పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ బంద్ లో పాలుపంచుకున్నాయి. సంబాల్ పూర్, జర్సుగూడ, బలంగీర్, సోన్ పూర్, బర్ గడ్ తదితర జిల్లాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. కోశల్ సమన్వయ సమితి, కోశల్ క్రాంతిదళ్ సంస్థలు సంయుక్తంగా ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.