: ఎలా ఆదుకుంటారు?... నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఈ ఉదయం నీతి ఆయోగ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టమైన నేపథ్యంలో, ప్యాకేజీ అన్ని వర్గాల ప్రజలకూ సంతృప్తికరంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. స్వచ్ఛభారత్ కార్యక్రమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఇచ్చిన ఆయన, స్మార్ట్ సిటీలు, విజయవాడ, తిరుపతి, విశాఖల్లో మెట్రో రైళ్లు, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికీకరణ వంటి పలు అంశాలను కేంద్ర అధికారుల ముందు ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకుంటారో, ప్యాకేజీల్లో భాగంగా ఎంత మొత్తంలో నిధులిస్తారో స్పష్టంగా తెలియజేయాలని బాబు కోరినట్టు తెలుస్తోంది. చంద్రబాబు టీం నిన్న మోదీని కలసి సుదీర్ఘంగా చర్చించినప్పటికీ, రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదాపై ఎటువంటి హామీ లభించని సంగతి విదితమే.

  • Loading...

More Telugu News