: పటేళ్ల బంద్ మరింత హింసాత్మకం... 9 ప్రాంతాల్లో కర్ఫ్యూ
తమను ఓబీసీ కోటాలో చేర్చాలంటూ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పటేల్ సామాజిక వర్గం చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇచ్చిన పిలుపుతో ఈరోజు రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. అహ్మదాబాద్, సూరత్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల కిటీకీల అద్దాలు పగులకొట్టారు. భారీగా ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను తగులబెడుతున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్ లోని తొమ్మిది ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. విద్యాసంస్థలు మూసివేశారు. ఆందోళనపై వదంతులు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ ను నిలిపివేశారు.